
Choregrapher PASUMARTHI KRISHNAMURTHI directing Lata & Murlimohan for a song in the film Prema Paga - This post is about Pasumarthi .... Wiki pedia has a wonderful write up on him - పసుమర్తి కృష్ణమూర్తి (1925 నవంబరు 12 - 2004 ఆగష్టు 8 ) ప్రముఖ తెలుగు సినిమా నృత్య దర్శకులు. మానసోల్లాసం, ఆహ్లాదం, ఆనందం, హాయీ కలిగిస్తూ కనుల పండువ అనిపించే నాట్యాలను తెర మీద ఆవిష్కరించాడు పసుమర్తి కృష్ణమూర్తి. ఏ గందరగోళం లేకుందా, మనోహరంగా రూపొందించాడు. ఆయన చిత్ర నృత్యాలలో అభినయం, ఆంగికం, ముఖభావాలూ అన్నీ ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మల్లీశ్వరి (1951), పాతాళ భైరవి (1951) మిస్సమ్మ (1955), మాయాబజార్ (1957), శ్రీకృష్ణార్జున యుద్ధము (1963) వంటి సుప్రసిధ్ధ చిత్రాలలోని నృత్యాల రూపశిల్పి కృష్ణమూర్తి.ఆయన ఆరో ఏట నుంచే నాట్యాభ్యాసం ప్రారంభించారు. చదువులో వెనుకబడితే, దాన్ని మళ్లీ పట్టుకుని ఇంటి దగ్గరే తెలుగు, సంస్కృతం నేర్చుకున్నారు. దరువులు, కీర్తనలు నోటిపాఠంగా నేచుకుని యక్షగానాల్లో ప్రహ్లాదుడు, లోహితుడు, లవుడు, కుశుడు వంటి బాలపాత్రలు అభినయించేవారు. సంగీతం వేరేగా ...